మాస్ మహారాజా రవితేజ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో.. ‘అనార్కలి’ టాక్!

ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రెండ్‌లో రవితేజ

మాస్ చిత్రాలతో దూసుకెళ్లిన రవితేజ, ఈసారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమలతో రవితేజ ఓ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రెండ్‌లో రవితేజ

సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ కావడంతో, దర్శకులు ఫ్యామిలీ కథల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రెండ్‌లో రవితేజ ఓ సరికొత్త కథతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్‌ను బీవీఎస్ రవి రెడీ చేయగా, దర్శకత్వ బాధ్యతలు కిషోర్ తిరుమల చూసుకోనున్నారు.

‘అనార్కలి’ టైటిల్ ఫిక్స్?

ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్ ఖరారవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి నిర్మించనున్నారని టాక్.

హీరోయిన్లు, సంగీతం.. సంక్రాంతి రిలీజ్ ప్లాన్?

ఇప్పటికే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల పేర్లు బయటకొస్తున్నాయి. ‘ప్రేమలు’ ఫేమ్ మామితా బైజు, ‘డ్రాగన్’ నాయిక కయాదు లోహర్ రవితేజకు జోడీగా కనిపించనున్నట్లు సమాచారం. సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి!

Read More

One thought on “మాస్ మహారాజా రవితేజ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో.. ‘అనార్కలి’ టాక్!

Comments are closed.