‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ-రిలీజ్‌పై అంజలి ఎమోషనల్ పోస్ట్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ-రిలీజ్‌పై అంజలి ఎమోషనల్ పోస్ట్

మహేష్‌ బాబు, వెంకటేష్‌ ప్రధాన పాత్రల్లో, సమంత, అంజలి హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ క్లాసిక్ మూవీ, రీ-రిలీజ్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది.

టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్‌ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రీ-రిలీజ్ సందర్భంగా హీరోయిన్ అంజలి సోషల్ మీడియాలో స్పందిస్తూ, “కుటుంబ బంధాలను అందంగా చూపించిన ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. మీ ప్రేమను మరోసారి పంచండి” అంటూ పోస్ట్ చేశారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మహేష్, వెంకీ అన్నదమ్ములుగా నటించారు. అంజలి పాత్రకు కథలో కీలక ప్రాధాన్యత ఉండటంతో, ఆమె మేనరిజం, డైలాగ్ డెలివరీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో స్టార్‌డం అందించిందని చెప్పొచ్చు.

ఇకపోతే, మహేష్ తాజా చిత్రం ‘SSMB 29’ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, వెంకటేష్ సంక్రాంతి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ హిట్ అందుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో.. మరోసారి థియేటర్లలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Read More

One thought on “‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ-రిలీజ్‌పై అంజలి ఎమోషనల్ పోస్ట్

Comments are closed.