ఒకరు వెయ్యి కోట్లు సాధించిన సౌత్ స్టార్, మరొకరు హిందీ సినిమాతో అదే ఘనత సాధించిన తమిళ డైరెక్టర్.

Allu arjun and Atlee

ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘రెండు వేల కోట్లు’ సాధిస్తారా అన్న ప్రశ్నతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు యువ దర్శకుడు అట్లీ కుమార్ మధ్య ఈ చిత్రంతో సంచలనాలు రాబోతున్నాయి.

“పుష్ప- ది రూల్”తో రికార్డులన్నింటినీ ముక్కలుచేసిన బన్నీ, తన తదుపరి ప్రాజెక్టు పై చర్చలు జరుగుతున్నా, త్వరలోనే అట్లీతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. అసలు ఎటువంటి కథ ఈ సినిమాలో ఉన్నదంటే, బన్నీకి తగ్గ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయి ఉందట, ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా మూవీగా తయారు చేయాలని అట్లీ అభిప్రాయపడుతున్నారని సమాచారం.

అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించబోతున్నారు తెలిసింది. ఆయన “అమరన్” సినిమాతో తెలుగులో కూడా క్రేజ్ సంపాదించాడు.

అలాగే, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనున్నారట. ఇంకా, అంతర్జాతీయ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ, ఈ ప్రాజెక్టు భారీ స్థాయిలో తెరకెక్కించబడుతున్నట్టు తెలుస్తోంది. మరి అట్లీ ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దానిపై అందరి దృష్టి ఉంది.

Read More

One thought on “ఒకరు వెయ్యి కోట్లు సాధించిన సౌత్ స్టార్, మరొకరు హిందీ సినిమాతో అదే ఘనత సాధించిన తమిళ డైరెక్టర్.

Comments are closed.