కూటమి సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు (Actor), రచయిత (Writer) పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తీవ్ర అస్వస్థత (Health Issues) కు గురయ్యారు. దాంతో సబ్ జైలు (Sub Jail) నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి (Rajampeta Government Hospital) కి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స (Treatment) అందిస్తున్నారు.
గత రాత్రి నుండి పోసాని ఛాతీలో నొప్పి (Chest Pain) తో బాధపడుతున్నట్లు సమాచారం. పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా (Annamayya District) రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ (Railway Koduru Magistrate) 14 రోజులు రిమాండ్ (14-Day Remand) విధించారు.
గురువారం రాత్రి (Thursday Night) 9 గంటలకు పోలీసులు కృష్ణమురళిని మెజిస్ట్రేట్ (Magistrate) ఎదుట హాజరుపరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డు (Nandi Award) తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన (Jana Sena) నేత ఫిర్యాదు (Complaint) మేరకు ఈ కేసు నమోదైంది.
ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ (Former Additional Advocate General – AAG) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.
