సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌కు చేసిన ప్రత్యేక షరతులు!

ఆడియన్స్ తొందరపడుతుంటే.. ఆ డైరక్టర్‌ మాత్రం.. “జస్ట్ కూల్‌” అంటున్నారట. అక్కడో కాలూ.. ఇక్కడో కాలూ.. వేస్తానంటే కుదరదు. నా దగ్గరకు వస్తే, కంప్లీట్‌గా ఇక్కడే ఉండాలి. రాజమౌళి మాట మహేష్‌ విన్నట్టు.. నా మాట మీరు విని తీరాల్సిందే డార్లింగ్‌ అని అంటున్నారట. ఇంతకీ ఆ కెప్టెన్‌ ఎవరో గెస్‌ చేశారా?

నా థాట్‌ వేరు… నా film వేరూ అంటూ చాలా స్పెషల్‌గా రూట్‌ మ్యాప్‌ వేసుకుంటున్నారు కెప్టెన్‌ Sandeep Reddy Vanga. ఎవరెన్ని అన్నా.. ఏం అన్నా.. తాను నమ్మిన విషయాన్ని పక్కాగా అమలు చేసుకుంటున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే Prabhas కి కూడా conditions apply అంటున్నారట Sandeep.

రీసెంట్‌గా Kalki సక్సెస్‌ చూసిన Prabhas కు ఇప్పుడు సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి Raja Saab. రెండు Fauji. Raja Saab ఈ ఏడాది రిలీజ్‌ అయినా, Faujiని నెక్స్ట్ ఇయర్‌కి షిఫ్ట్ చేసే అవకాశాలున్నాయి. అంతలో Salaar సినిమా ముందుకొస్తే?

Salaar ముందుకొచ్చినా, Kalki సీక్వెల్‌ ముందుకొచ్చినా… Spirit వెనక్కి వెళ్లే ప్రమాదం గట్టిగా కనిపిస్తోంది. దానికి రీజన్‌ కూడా Sandeep Reddy Vanga. నా సినిమా చేస్తున్నప్పుడు మరే సినిమాలో నటించకూడదు, నా movie look బయటకు లీక్‌ కావడానికి వీల్లేదు.

అందుకే మిగిలిన సినిమాలన్నిటినీ కంప్లీట్‌ చేశాకే, నా సినిమాకు రండి అని స్ట్రాంగ్ గానే చెప్పేస్తున్నారట. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో Prabhas.. Sandeep Reddy Vanga సినిమా షూటింగ్‌కి వెళ్తే Raja Saab, Fauji ప్రమోషన్లకు హాజరు కావడం కుదరదు.

అలాగని రాకుండా ఉంటారా? లేకుంటే get-upని ఏదో రకంగా మేనేజ్‌ చేస్తారా? అసలు Spirit ని ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు Rebel Army ఆన్సర్‌ ప్లీజ్‌ అని అడుగుతున్న ప్రశ్నలివి.

Read more

One thought on “సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌కు చేసిన ప్రత్యేక షరతులు!

Comments are closed.