ఐటీ సోదాలపై అనిల్ రవిపూడి స్పందన

సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్‌లో ఐటీ సోదాలపై స్పందించిన అనిల్ రవిపూడి

“సంక్రాంతికి వస్తున్నాం” మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు అనిల్ రవిపూడి, ఇండస్ట్రీలోని ప్రముఖులపై జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందించారు.

ఒక జర్నలిస్ట్, “మీ నిర్మాత దిల్ రాజు ఐటీ రైడ్స్ బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారని” అడిగిన ప్రశ్నకు అనిల్ సమాధానంగా చెప్పారు, “సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టాం కదా.. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో. దిల్ రాజు బాధలో లేరు. ఆయన ఒక్కడిపైనే రైడ్స్ జరగడం లేదు. ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీ, బిజినెస్ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం.”

మరొక జర్నలిస్ట్ “సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి, మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉందా?” అని అడిగితే, అనిల్ సరదాగా సమాధానమిచ్చారు, “నేను సుకుమార్ ఇంటి పక్కన లేను. ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతాను. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి.. మా ఇంటికి కూడా వస్తారేమో.”

ఈ వ్యాఖ్యలతో, అనిల్ రవిపూడి సినీ పరిశ్రమలో ఐటీ సోదాల గురించి సాదారణ దృక్కోణాన్ని వ్యక్తం చేశారు.

One thought on “ఐటీ సోదాలపై అనిల్ రవిపూడి స్పందన

Comments are closed.