డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఫోన్ చేశారు. వాణిజ్యం, టిక్‌టాక్ తదితర అంశాలపై చర్చించుకున్నారు.
వాషింగ్టన్, జనవరి 17: డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఫోన్ చేశారు. వాణిజ్యం, టిక్‌టాక్ వంటి అంశాలపై రెండు దేశాలు చర్చించుకున్నాయి. ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఒకరినొకరు గౌరవించుకుని సమస్యలను పరిష్కరించాలని ట్రంప్ తెలిపారు. జిన్‌పింగ్‌తో ఫోన్ సంభాషణ తరువాత, ట్రంప్ ఈ విషయాలను తన సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ ద్వారా వెల్లడించారు. సర్వసాధారణంగా అనేక సమస్యలను కలిసి పరిష్కరించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ కూడా హాజరుకానున్నారు.
Also Read:
