అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాను, యువ దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఎ. దయాకర్ రావు నిర్మాత. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ‘హరి హర వీర మల్లు: పార్ట్ -1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ‘మాట వినాలి…’ అనే పాటను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు ప్రకటించాయి. కొత్త ఏడాది ఆరంభంలో ఈ పాట విడుదల తేదీని పోస్టర్ ద్వారా ప్రకటించింది చిత్రబృందం. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించారు. సంగీతం: ఎం. ఎం. కీరవాణి. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది.
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్రం: పాట విడుదల తేదీ ప్రకటించబడింది!
Share This
