ఏపీ లిక్కర్ కుంభకోణంపై సిట్ దూకుడు కొనసాగిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లో సిట్ బృందాలు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. చిత్తూరులోని మోహిత్ రెడ్డి ఇన్‌ఫ్రా కంపెనీతో పాటు బీవీరెడ్డి కాలనీ, నలందా నగర్, నిఖిలానంద అపార్ట్‌మెంట్ కార్యాలయాల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్‌లో ఉన్న మోహిత్ రెడ్డి కంపెనీలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. సిట్ దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రికార్డుల్లో ఒక పేరు, భౌతికంగా మరో పేరు ఉన్న కంపెనీలు బయటపడుతున్నాయని అధికారులు తెలిపారు. చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్ద వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు ఉండగా, ఆ సంస్థ వైసీపీ నేత విజయానంద్ రెడ్డిదిగా గుర్తించారు. ఈ కార్యాలయంలో మోహిత్ రెడ్డి, విజయానంద్ రెడ్డి కంపెనీల లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ ప్రశాంతి హిల్స్‌లోని భీమ్ స్పేస్ కార్యాలయంలో ఇషా ఇన్‌ఫ్రా పేరుతో బోర్డు ఉన్నట్లు గుర్తించారు. ఆ సంస్థ డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి, మాజీ సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల సమయంలో రూ.8 కోట్లు పెట్టుబడిగా పెట్టానని, అవి తనవేనని ప్రద్యుమ్న క్లెయిమ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Read More : అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం శంకుస్థాపన.
One thought on “ఏపీ లిక్కర్ కుంభకోణం: సిట్ దూకుడు, చెవిరెడ్డి కంపెనీల్లో సోదాలు.”
Comments are closed.