బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ… కవితకు ఇది కుటుంబ, డబ్బు సమస్య మాత్రమేనని వ్యాఖ్యానించారు. కవిత సస్పెన్షన్‌కు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పంపకాలలో తేడా రావడంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఎందుకు ఉన్నారనే ప్రశ్న కూడా లేవనెత్తారు. హరీష్, సంతోష్ బాగోతాన్ని బయటపెట్టింది సీఎం రేవంత్ రెడ్డేనని గుర్తు చేశారు.
ఇక భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కవిత చెప్పిన విషయాలను సాక్ష్యాలుగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల అవినీతి వివరాలను రాతపూర్వకంగా సీబీఐకి అందించాలని సూచించారు. తన కుటుంబంలో ఎవరు ఎంత అవినీతి చేశారో కూడా బయటపెట్టాలని కవితను డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి కవిత ప్రవేశించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
Read More : రైతులకు గుడ్‌న్యూస్: తెలంగాణకు భారీగా యూరియా సరఫరా.

One thought on “కవిత సస్పెన్షన్‌పై కాంగ్రెస్ ఎంపీల ఘాటు వ్యాఖ్యలు.”
Comments are closed.