జాన్వీ కపూర్ ‘పరమ్‌ సుందరి’ రెయిన్‌ డాన్స్‌ సెన్సార్‌ క్లియరెన్స్ ?

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ త్వరలో తన తాజా చిత్రం ‘పరమ్‌ సుందరి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు హిందీలో పలు సినిమాలు చేసిన జాన్వీకి పెద్ద హిట్‌ దక్కకపోయినా, ఈ సినిమాపై మాత్రం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పరమ్‌ సుందరి’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి సినిమా చుట్టూ బజ్‌ పెరుగుతూ వచ్చింది. ఇటీవల విడుదలైన ‘భీగీ సారి’ పాటతో ఆ హైప్‌ మరింతగా పెరిగింది. సిద్దార్థ్‌ మల్హోత్రాతో కలిసి జాన్వీ చేసిన రొమాంటిక్‌ రెయిన్‌ డాన్స్‌ ప్రేక్షకులను, అభిమానులను ముగ్ధులను చేసింది. ఇది జాన్వీ కెరీర్‌లోనే బెస్ట్‌ రెయిన్‌ సాంగ్‌గా ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు. అయితే ఈ సన్నివేశం థియేటర్‌ రిలీజ్‌లో ఉండదేమో అనే ఆందోళన వ్యక్తమైంది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ సినిమాలకు కఠినమైన సెన్సార్‌ కట్స్‌ రావడంతో, ఈ పాట కత్తిరించబడుతుందేమోనని అభిమానులు భావించారు. అయితే మేకర్స్‌ సెన్సార్‌ బోర్డ్‌ ముందు గట్టిగా వాదించడంతో, ఏ సీన్‌ కూడా కట్‌ చేయకుండా యూ/ఎ సర్టిఫికెట్‌తో క్లియరెన్స్‌ వచ్చింది. అయితే 13 ఏళ్లు పైబడినవారు మాత్రమే చూడాలనే ప్రత్యేక నిబంధనను సెన్సార్‌ బోర్డ్‌ విధించింది.

ఈ క్లియరెన్స్‌ రావడం జాన్వీ అభిమానులకు మాత్రమే కాకుండా, చిత్ర యూనిట్‌, నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా పెద్ద గుడ్‌న్యూస్‌ అని చెప్పాలి. ఈ పాటతో సినిమాకు మినిమం ఓపెనింగ్స్‌ ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఈ పాట సినిమాకు డబుల్‌ ఇన్‌కమ్‌ తెస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

జాన్వీ కపూర్‌ ఇప్పటి వరకు బిగ్‌ కమర్షియల్‌ హిట్‌ అందుకోకపోయినా, ఈ లోటును ‘పరమ్‌ సుందరి’ తీర్చే అవకాశం ఉందని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఆమె తెలుగులో ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా విజయం సాధిస్తే, టాలీవుడ్‌లో ఆమె మరింత బిజీ అండ్‌ కాస్ట్లీ హీరోయిన్‌గా మారడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More : టీజర్‌తో హైప్‌.. సెప్టెంబర్ 12న విడుదలకు తేజ సజ్జ ‘మిరాయ్’

One thought on “జాన్వీ కపూర్ ‘పరమ్‌ సుందరి’ రెయిన్‌ డాన్స్‌ సెన్సార్‌ క్లియరెన్స్ ?

Comments are closed.