ధర్మస్థల కేసులో ఫిర్యాదుదారు అరెస్టు విషయంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఈ కేసు విచారణపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేస్తూ, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
శివకుమార్ మాట్లాడుతూ, “ఈ దర్యాప్తుపై నాకు మొదటి నుంచే నమ్మకం ఉంది. మత పెద్దలు కూడా ఈ విచారణను స్వాగతించారు. ఎవరు తప్పు చేసినా, వారిపై చర్యలు తప్పక తీసుకోవాలి” అని అన్నారు. తన వైఖరి ఎల్లప్పుడూ న్యాయం, మతానికి మద్దతుగానే ఉంటుందని శివకుమార్ చెప్పారు. మతపరమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తనకు ఇష్టంలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సున్నితమైన అంశంలో తాను కోరుకునేది కేవలం న్యాయం మాత్రమేనని శివకుమార్ తెలిపారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలు వెలికితీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : ట్రంప్ వ్యాఖ్యలపై జైశంకర్ ఘాటు స్పందన

One thought on “ధర్మస్థల కేసుపై డీకే శివకుమార్ స్పందన”
Comments are closed.