పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో కశ్మీర్ లోని కథువా జిల్లాలో కలకలం రేపిన ఒక పావురం, అధికారులను అప్రమత్తం చేసింది. ఈ పావురంపై ‘కశ్మీర్ మాది. సమయం వచ్చింది. అది వస్తుంది’ అని ఉర్దూలో, ‘జమ్మూ స్టేషన్ ఈఐడీ బ్లాస్ట్’ అని ఆంగ్లంలో రాసి ఉంది.
జమ్మూలోని రంజిత్ సాగర్ సరస్సు వద్ద నిఘా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి ఈ పావురం దొరికింది. దానిని పరిశీలించగా, దానిపై రెండు రకాల భాషల్లో రాసిన సందేశం కనిపించింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై, జమ్మూలోని పలు ముఖ్య ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. పావురాన్ని నిఘా కోసం వినియోగించారా లేదా అనేది నిర్ధారించుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇది పాకిస్థాన్ నుండే వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జమ్మూ-కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతను పెంచింది.
Read more : 30 రోజుల నిర్బంధం ఉంటే ప్రధాని–మంత్రులు పదవి కోల్పోయే బిల్లు

One thought on “కశ్మీర్ కథువా జిల్లాలో సందేశంతో పావురం కలకలం”
Comments are closed.