ఢిల్లీలోని ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై స్పందిస్తూ, రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని భద్రత బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి.
ముఖ్యమంత్రి భద్రత కోసం 24 గంటలూ అదనపు బలగాలను మోహరించడం జరిగింది. జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ప్రధాన మంత్రి రేఖా గుప్తాకు కేటాయించారు. బుధవారం ఉదయం ఆమె నిర్వహించిన ‘జన్ సున్ వాయ్’ కార్యక్రమంలో, సమస్యలు చెప్పడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు సమాచారం. వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.
Read More : కశ్మీర్ కథువా జిల్లాలో సందేశంతో పావురం కలకలం
