జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను సన్మానించిన సీఎం

71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో వివిధ విభాగాల్లో పురస్కారాలు పొందిన సినీ ప్రముఖులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.

సన్మానం అందుకున్న ప్రముఖులు:

  • ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి.
  • ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు విజువల్ ఎఫెక్ట్స్ బృందం సభ్యులు వెంకట్, శ్రీనివాస్.
  • ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్.
  • ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ.
  • గాయకుడు రోహిత్.

ఈ కార్యక్రమంలో ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, ‘బేబి’ నిర్మాత ఎస్.కె.ఎన్., అలాగే ‘భగవంత్ కేసరి’ నిర్మాత గారపాటి సాహు కూడా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు లభించిన గుర్తింపు పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

Read More : నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం