ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలను వెంటనే పట్టుకుని షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తీవ్ర వివాదాలు సృష్టించాయి. ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా, “వీధి కుక్కలు సమస్య కాదు. వీటిని ఒకేసారి తిప్పికొట్టడం అవివేకపూరిత చర్య. షెల్టర్లు, సంతాన నియంత్రణ, వ్యాక్సినేషన్ ద్వారా వీధులను సురక్షితంగా నిర్వహించవచ్చు. ప్రజల భద్రతతో పాటు జంతు సంక్షేమం రెండూ పరస్పరం సాధ్యమనే విషయాన్ని మర్చకూడదు” అని తెలిపారు.
సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను వెంటనే చర్యలు చేపట్టాలని, 8 వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరించింది.
ఈ తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. FIAPO, PETA వంటి సంస్థలు ఈ నిర్ణయం జంతు సంక్షేమ చట్టానికి విరుద్ధమని, వేరే ప్రాంతాల నుంచి కొత్త కుక్కలు రావడం వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇదే సమయంలో, నివాస సంక్షేమ సంఘాలు ఆదేశాలను స్వాగతించినప్పటికీ, జంతు ప్రేమికులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం కూడా గుర్తించదగ్గది.
Read More : కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థగా ప్రకటన?

One thought on “దిల్లీ వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు: Rahul”
Comments are closed.