బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఆ క్రమంలో, ఆదివారం రాత్రి హైదరాబాద్లో అద్భుతంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హృతిక్, ఎన్టీఆర్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు కూడా భారీగా తరలివచ్చి సందడి చేశారు.
ఈ వేడుక ముగిసిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్, ఎక్స్ (ట్విట్టర్)లో ఓ వీడియో విడుదల చేస్తూ క్షమాపణలు కోరారు. ఈవెంట్ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మరిచిపోయానని ఆయన తెలిపి, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ… “ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను, నన్ను క్షమించాలి. ఈవెంట్ సజావుగా జరగడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, పోలీస్ శాఖ అందించిన మద్దతుకు పాదాభివందనాలు. ఎంతో బాధ్యతతో అభిమానుల ఆనందానికి కారణమయ్యారు” అని పేర్కొన్నారు.
Read More : ‘కాంతార చాప్టర్ 2’కు మరో విషాదం

One thought on “‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ క్షమాపణలు”
Comments are closed.