‘కాంతార చాప్టర్ 2’కు మరో విషాదం

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖ కన్నడ నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. ఉడుపిలోని హిరియడ్కలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు.

గతంలో గుండెకు సంబంధించిన చికిత్స తీసుకున్న ఆయన, కొన్ని రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగైనప్పటికీ, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో సినిమా టీమ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వరుస దుర్ఘటనలు:
‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.

  • గత నవంబర్‌లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్‌కు ప్రమాదం జరగడంతో చాలా మంది గాయపడ్డారు.
  • ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
  • అలాగే, హాస్యనటుడు రాకేష్ పూజారి (33) గుండెపోటుతో మరణించారు.

ఇప్పుడు నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి మరణంతో ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ మరోసారి దిగ్భ్రాంతికి గురైంది.

Read More : మహేష్-రాజమౌళి సినిమా: (update )

One thought on “‘కాంతార చాప్టర్ 2’కు మరో విషాదం

Comments are closed.