‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ శంకర్‌పల్లి’ కార్యక్రమంలో సినీనటుడు సునీల్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద రోజుల ప్రణాళికను ప్రశంసించారు. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి కోసం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
‘ఓ మార్పు.. అభివృద్ధికి మలుపు’ అనే నినాదంతో శంకర్‌పల్లి పురపాలిక కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతోందని సునీల్ తెలిపారు. ఇందులో తాను కూడా పాల్గొన్నట్లు చెప్పారు. శంకర్‌పల్లిని పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను మున్సిపాలిటీ వాహనాల్లోనే వేయాలని ప్రజలకు సూచించారు. అలాగే, ప్లాస్టిక్‌ను 100 శాతం నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సునీల్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.
Read More : హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక

One thought on “‘స్వచ్ఛ తెలంగాణ’లో భాగస్వామి: సినీనటుడు సునీల్”
Comments are closed.