శ్రీలంక నేవీ తమ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని మన్నార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా నేవీ అధికారులు రెండు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే స్పందించారు. జాలర్లను, వారి పడవలను తక్షణమే విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీలంక కస్టడీలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. జాలర్ల భద్రత, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని స్టాలిన్ కోరారు.
Read More : శ్రీలంక నేవీ మరోసారి భారత జాలర్ల అరెస్ట్

One thought on “జాలర్ల అరెస్ట్: కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం లేఖ”
Comments are closed.