సెంట్రల్ కాలిఫోర్నియాలో గిఫోర్డ్ కార్చిచ్చు

అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ స్థాయిలో కార్చిచ్చు చెలరేగి భయానక స్థితి నెలకొంది. గత శుక్రవారం ప్రారంభమైన ఈ మంటలు వేగంగా విస్తరిస్తూ విపరీతమైన నష్టం కలిగిస్తున్నాయి. ‘గిఫోర్డ్ ఫైర్’గా గుర్తించిన ఈ అగ్నికీలలు ఇప్పటివరకు 65,000 ఎకరాలకుపైగా భూభాగాన్ని భస్మం చేశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ మంటలు అదుపులోకి రాకపోవడంతో లాస్ ఏంజిల్స్, వెంచురా, కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియాలోని పలు కౌంటీలతో పాటు సమీప లాస్ వెగాస్ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాలివానల కారణంగా మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని అగ్నిమాపక సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

అత్యవసర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం కాలిఫోర్నియాలో ఇటీవలి కాలంలో నమోదైన అతిపెద్ద కార్చిచ్చులలో ఒకటిగా గుర్తించారు.

One thought on “సెంట్రల్ కాలిఫోర్నియాలో గిఫోర్డ్ కార్చిచ్చు

Comments are closed.