రాజకీయ నాయకుల ప్రసంగాల్లో దిగజారుతున్న ప్రమాణాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అసభ్య పదజాలం, బూతులు వాడటం ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… “రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం గొప్పగా భావిస్తున్నారు. కానీ భాష హుందాగా ఉండాలి. మాట్లాడే ప్రతి ఒక్కరూ తమ మాటతీరుపై ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని హితవు పలికారు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలా మాట్లాడరని ఆయన అన్నారు. రాజకీయాల్లో విలువలు పడిపోవడానికి ఇలాంటి భాష వాడకం కూడా ఒక కారణమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Read More : అప్పుల బాధతో ముగ్గురు కుమార్తెలను చంపి ఆత్మహత్య
