మాలేగావ్ కేసులో భగవత్ అరెస్ట్ ఆదేశాలు

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఏటీఎస్ మాజీ అధికారి మహబూబ్ ముజావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ సహా పలువురిని అరెస్టు చేయాలని తనకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.

2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని ఓ మసీదు సమీపంలో మోటార్‌సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్, రమేశ్ ఉపాధ్యాయ, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అయితే ముంబై ప్రత్యేక కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.

నాటి విచారణ బృందంలో భాగమైన ముజావ్ మాట్లాడుతూ, “రామ్ కల్సంగ్రా, సందీప్ దాంగే, దిలీప్ పాటిదార్‌తో పాటు మోహన్ భగవత్‌ను కూడా అరెస్టు చేయాలని నాకు ఆదేశాలు ఇచ్చారు. మోహన్ భగవత్ వంటి వ్యక్తిని అరెస్టు చేయడం నా శక్తికి మించిన పని” అని చెప్పారు.

అప్పుడు పరమ్‌బీర్ సింగ్‌తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులే ఈ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తనకు సహాయంగా 10 మంది సిబ్బందిని, నిధులు, రివాల్వర్‌ను కూడా అందజేశారని పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడానికి తాను నిరాకరించడంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అనంతరం అన్ని కేసుల నుండి తాను నిర్దోషిగా బయటపడ్డానని ముజావ్ తెలిపారు.

Read More : అసెంబ్లీలో రమ్మీ వివాదం

One thought on “మాలేగావ్ కేసులో భగవత్ అరెస్ట్ ఆదేశాలు

Comments are closed.