లండన్‌లో ఊర్వశి రౌతేలాకు షాకింగ్ అనుభవం

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలాకు లండన్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. వింబుల్డన్ టోర్నీకి హాజరై భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న ఆమె లగ్జరీ సూట్‌కేస్ గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో దొంగిలించబడింది. ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఊర్వశి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌కు ఆమె హాజరైన విషయం తెలిసిందే.

తన విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఊర్వశి తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, విమానాశ్రయ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని వాపోయారు. గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌ వర్గాల నుంచి ఇంకా స్పందన రాలేదన్నారు.

ఇక ఇదే మొదటిసారి కాదని ఊర్వశి గుర్తు చేశారు. 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా రూ.45 లక్షల విలువైన ఆభరణాలు పోగొట్టుకోవడం, గతంలో తన ఐఫోన్ కూడా చోరీకి గురైనట్లు తెలిపారు.

Read More : మోహన్‌బాబు, విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట

One thought on “లండన్‌లో ఊర్వశి రౌతేలాకు షాకింగ్ అనుభవం

Comments are closed.