వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి కొడాలి నానిపై మచిలీపట్నం పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును రద్దు చేయాలంటూ నాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణపై స్టే మంజూరు చేసింది.
అలాగే వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అప్పిరెడ్డిలకు కూడా ఊరట లభించింది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను రద్దు చేయాలంటూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది.
అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసుల వ్యవహారంలో నేతలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అయింది.

One thought on “కొడాలి నాని, పలువురు వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట”
Comments are closed.