బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వివాదంలో ఐఏఎస్ రింకు సింగ్

బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే యూపీ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ చర్చనీయాంశమయ్యారు. షాజహాన్‌పూర్ జిల్లా సబ్‌డివిజన్‌ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన రింకు సింగ్, తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కార్యాలయం పరిసరాల్లో కొంతమంది బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ కనిపించడంతో, వారిని గుంజీలు తీయించి శిక్షించారు.

అయితే, ఈ ఘటనపై అక్కడి న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు బహిరంగ మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. ముందు సౌకర్యాలు కల్పించి తర్వాత శిక్షలు విధించండి” అంటూ వారు ఆందోళన చేపట్టారు.

వారి అభ్యంతరాలను స్వీకరించిన రింకు సింగ్ వెంటనే క్షమాపణలు తెలిపారు. టాయిలెట్ సౌకర్యాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More : పార్లమెంట్ ఆవరణలో ఇండియా బ్లాక్ ఎంపీల నిరసన

One thought on “బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వివాదంలో ఐఏఎస్ రింకు సింగ్

Comments are closed.