పార్లమెంట్ ఆవరణలో ఇండియా బ్లాక్ ఎంపీల నిరసన

పార్లమెంట్ ఆవరణలో ఇండియా బ్లాక్ ఎంపీల నిరసన కొనసాగుతోంది. మకర ద్వారం వద్ద ఇండియా బ్లాక్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కేరళ నన్స్‌ను ట్రాఫికింగ్, మత మార్పిడి ఆరోపణలతో అరెస్టు చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎంపీలు, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు ఇండియా బ్లాక్‌ నేతలు పాల్గొన్నారు. నన్స్‌పై తప్పుడు ఆరోపణలు మోపి అరెస్టు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని ఎంపీలు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిర్దోషులను విడిపించాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆవరణలో నిరసన చేపట్టడం ద్వారా తమ డిమాండ్‌ను మరింత బలంగా చాటాలని ఇండియా బ్లాక్ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం వైఖరిని పార్లమెంట్‌లో కూడా ప్రశ్నించనున్నట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Read More : 25% సుంకాల హెచ్చరిక చేసిన ట్రంప్

One thought on “పార్లమెంట్ ఆవరణలో ఇండియా బ్లాక్ ఎంపీల నిరసన

Comments are closed.