ఫిడే మహిళల ప్రపంచకప్‌లో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో తెలుగు స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపిపై ఉత్కంఠభరితంగా సాగిన టై బ్రేక్ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో మొదటి రెండు గేమ్స్ సమానంగా ముగియడంతో విజేత నిర్ణయానికి టై బ్రేక్ మ్యాచ్ నిర్వహించారు. ఈ టై బ్రేక్‌లో దివ్య తన దూకుడు ఆటతీరుతో ఆధిక్యాన్ని సాధించి కోనేరు హంపిని మట్టికరిపించింది. దీంతో దివ్య దేశ్‌ముఖ్ తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకుని ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
ఈ విజయం దివ్య కెరీర్లో మైలురాయిగా నిలవడంతో పాటు భారత మహిళా చెస్ చరిత్రలో మరో గర్వకారణంగా నిలిచింది.

One thought on “ఫిడే మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్”
Comments are closed.