బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం – ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం

రాచకొండ కమిషనరేట్‌లోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించి, పరిసరాల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే, ప్లాస్టిక్ దానా నిల్వలు పూర్తిగా కాలిపోవడంతో ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడానికి ప్లాస్టిక్ పదార్థాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా వేరే కారణాలున్నాయా అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More : ఇంటింటికీ మద్యం – కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

One thought on “బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం – ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం

Comments are closed.