జైలులో మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కుటుంబ సభ్యులు కలిశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా వెళ్లి మిథున్ రెడ్డిని పరామర్శించి, ఆయనకు ఇంటి వంట భోజనం అందజేశారు. కోర్టు అనుమతితో రోజుకు ఒక పూట ఇంటి భోజనం అందించే అవకాశం లభించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ, “వైసీపీ శ్రేణులను అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదు. టెర్రరిస్టులను ట్రీట్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి పెద్దిరెడ్డిని కలిసి కాసేపు చర్చలు జరిపారు. వైఎస్సార్‌సీపీ కీలక నేతతో టీడీపీ ఎమ్మెల్యే సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More : భర్తను హత్య చేసి ఇంటి ముందే మృతదేహం వదిలిన భార్య