Heavy rains : అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

భాగ్యనగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల సురక్షితంపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు అని తెలిపారు.

జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్స్ అధికారులు సహా సంబంధిత శాఖలతో ఇప్పటికే సమన్వయం జరిపామని మంత్రి వెల్లడించారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, 141 వాటర్ లాగింగ్ పాయింట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తక్షణమే స్పందించేందుకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. విపత్తుల సమయంలో ధైర్యంగా ఉండాలని, అధికారులకు తక్షణ సమాచారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Read More : పంజాగుట్టలో ఉల్లిపాయల లోడుతో లారీ బోల్తా..

One thought on “Heavy rains : అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Comments are closed.