బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు… కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదు – పొన్నం

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల హామీలలో బీసీలకు 42% రిజర్వేషన్ లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చిందని, అయితే కేంద్రం ఎందుకు ఈ బిల్లును ఆమోదించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలపై ఉందన్నారు. రాష్ట్రపతితో ఆమోదింపజేసి.. 9వ షెడ్యూల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం లేదా అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని పొన్నం తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీ నేతలు వాళ్ల అధిష్టానంపై ఒత్తిడి పెంచాలి. బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కులగణన చూసిన తర్వాతే కేంద్రం కళ్లు తెరిచింది. రాష్ట్ర ఒత్తిడితోనే కేంద్రం జనగణనతో పాటు కులగణనను ప్రకటించిందని పొన్నం ప్రభాకర్ అన్నారు.

One thought on “బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు… కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదు – పొన్నం

Comments are closed.