ముంబయి: దేశంలోని ఘోరమైన పప్రమాదంగా పేర్కొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్
ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక తాజాగా బయటపెట్టింది. మొత్తం 15 పేజీలతో రూపొందించిన ఈ నివేదికలో దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రమాదం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కన్పించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు.
విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు ఎగరలేదు. పక్షి ఢీకొన్న ఆనవాళ్లను కూడా గుర్తించలేదని ఏఏఐబీ నివేదిక వెల్లడించింది. అంతేగాక, ఘటన వెనక విద్రోహ చర్య ఉండే అవకాశముందని చెప్పేందుకు కూడా ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది. అయితే, ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తోంది.
ప్రైమరీ రిపోర్ట్ లోని మరిన్ని అంశాలు:
- ఒక సెకను తేడాతో రెండు ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఒకటి కొద్దిగా పనిచేయగా.. రెండోది రికవరీ అవడంలో ఫెయిల్ అయ్యింది.
*ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లుగా అనిపించాయి. కానీ, బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రస్ట్ పని చేసేందుకు ప్రయత్నించినట్లు కన్పించింది. దీన్నిబట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనిపిస్తోంది.
*టేకాఫ్ కు ఫ్లాప్ సెట్టింగ్, గేర్ సాధారణంగానే పని చేశాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆకాశం స్పష్టంగా కన్పించింది. గాలులు కూడా తేలికగానే ఉన్నాయి.
*ఎయిరిండియా పైలట్లు ఇద్దరూ మెడికల్ గా ఫిట్ గానే ఉన్నారు. ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం కూడా వారికి సరిపడా ఉంది.
*గతంలో ఈ విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్లలో సమస్య వచ్చిన సందర్భాలు లేవు.
*ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసింది. దీన్ని ఎయిరిండియా అనుసరించలేదు. సంబంధిత తనిఖీలు చేపట్టలేదు. విమానం డ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్స్ ను 2019, 2023లో భర్తీ చేశారు.
*ఇళ్ళ సముదాయాల మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. పలు భవనాలను విమానం ఢీకొట్టింది. దీంతో ఇంజిన్, ల్యాండింగ్ గేర్ తో పాటు విమాన శిథిలాలు దాదాపు 1000 అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురయ్యాయి. దీన్నిబట్టి ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు.
మరి, ప్రాథమికంగా వచ్చిన రిపోర్ట్ లోని అంశాలను బట్టి చూస్తే టెక్నికల్ గా సమస్య ఉందని తెలుస్తోంది. పూర్తి నివేదిక వస్తే మొత్తం విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Read More : సిద్ధరామయ్యకు ఢిల్లీ పర్యటనలో అవమానం?
