గూగుల్ తమ జెమినై ఏఐ ప్లాట్ఫామ్లో ఓ ఆసక్తికరమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఒక ఫోటోను ఎనిమిది సెకండ్ల వీడియోగా మలచుకునే అవకాశం కలిగిన ఈ ఫీచర్ ప్రస్తుతం “ఎంచుకున్న ప్రాంతాల్లో” గూగుల్ ఏఐ అల్ట్రా మరియు ప్రో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ వీఓ 3 (Veo 3) మోడల్ ఆధారంగా పనిచేస్తోంది. వీడియో సృష్టించాలనుకునే వారు, జెమినై టూల్ మెనూలోని ‘వీడియోస్’ ఎంపికను ఎంచుకుని, తమ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం, వీడియో ఎలా ఉండాలన్న వివరణతోపాటు, సంభాషణలు లేదా నేపథ్య శబ్దాల వంటి ఆడియో సూచనలతో కూడిన ప్రాంప్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. తయారైన తర్వాత, షేర్ బటన్‌ను నొక్కి వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. “మీ రోజువారీ వస్తువులను జీవంతంగా మార్చడం, డ్రాయింగ్స్ లేదా పెయింటింగ్స్‌కు ప్రాణం పోయడం, ప్రకృతి దృశ్యాలకు కదలిక ఇవ్వడం లాంటి సృజనాత్మక పనులకు ఇది ఉపయోగపడుతుంది,” అని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది.
ఈ ఏఐ ద్వారా రూపొందించిన వీడియోల్లో స్పష్టంగా కనిపించే వాటర్‌మార్క్‌తో పాటు, ‘SynthID’ అనే డిజిటల్ వాటర్‌మార్క్ కూడా ఉంటుంది. ఇది వీడియోలు ఏఐ ద్వారా రూపొందించబడినవని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఇది మాత్రమే కాక, ఈ ఏడాది మేలో గూగుల్ సినీ దర్శకుల కోసం రూపొందించిన తమ ‘ఫ్లో’ (Flow) అనే వీడియో జెనరేటర్లో ఇదే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Read More : సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ల ప్రీ రిలీజ్ హైలెట్స్
