రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన దీటి రోహిత్ అనే 25 ఏళ్ల యువకుడు దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “శివయ్య… నీకు తెలివి ఉండే నా తలరాతను ఇలాగా రాసావా? నీ కొడుకైతే ఇలానే రాస్తావా? మేము నీ కొడుకులం కాదా?” అంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ రోహిత్ భావోద్వేగంతో లేఖను రాశాడు. ఎమ్మెస్సీ పూర్తిచేసిన రోహిత్ ప్రస్తుతం బీఎడ్ చదువుతున్నాడు. డాక్టర్ కావాలన్న కల నెరవేరకపోవడం, ఆ ఆలోచనలో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండటం వల్ల అతడు తీవ్ర మనోవేదనలోకి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. జీవితంపై విరక్తి చెంది చివరకు ఆత్మహత్యకు దారితీశాడు. తాను ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న కోరిక నెరవేరిందని, “చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ” అంటూ రాసిన లేఖలో వెల్లడించాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇలాంటి ఘటనలు మరెవరికైనా జరగకూడదన్న దృష్టితో, మనోధైర్యం కోల్పోకుండ మానసిక ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

