వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్

నెల్లూరులో అత్యాధునిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన వీఆర్ హైస్కూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్కూల్ క్యాంపస్‌ను పూర్తిగా పరిశీలించి, క్లాస్‌రూంలను సందర్శించారు. డిజిటల్ విద్యా విధానంపై అవగాహన పొందుతూ, ప్రతి తరగతిలో విద్యార్థులతో సమయాన్ని గడిపారు. అంతేకాకుండా, వీధుల్లో జీవనం సాగిస్తూ భవిష్యత్తు గురించీ కలలు కంటున్న ఇద్దరు చిన్నారుల జీవితాలను మారుస్తూ, వారిని ఈ స్కూల్‌లో ఉచితంగా చేర్పించి పాఠశాల విద్యకు నూతన దిశగా నడిపించారు. వీరికి పూర్తి సౌకర్యాలతో విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. చదువుకోవాలన్న చిన్నారుల ఆకాంక్షకు అండగా నిలిచిన లోకేష్ చర్యపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “విద్యను అందరికీ అందించాలన్నదే మా లక్ష్యం. ఒక్కొక్కరికి మంచి భవిష్యత్తు నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పం” అని పేర్కొన్నారు.

rEAD mORE : మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పర్మిషన్

One thought on “వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్

Comments are closed.