అమెరికా టెక్సాస్‌లో ఘోర వరదల విలయం

అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్ ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. జులై 4న ఒక్క రోజే భారీ వర్షం కురవడంతో నదులు ఉప్పొంగాయి. ఈ వరదలు తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. ఇప్పటివరకు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు ఉన్నారు. కేర్ కౌంటీలో పరిస్థితి మరింత విషమంగా మారింది. గ్వాడలుపే నది ఒడ్డున ఉన్న ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి 27 మంది బాలికలు గల్లంతైనట్లు షెరిఫ్ లారీ లీథా తెలిపారు. వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక మరోవైపు కింగ్స్‌ల్యాండ్‌లోని లానో నదిపై ఉన్న ఓ భారీ వంతెనను వరద నీరు కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా ముంచెత్తింది. ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి వంతెనను మింగేసిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.

ఇక టెక్సాస్‌లో కొద్ది గంటల వ్యవధిలోనే 10 అంగుళాల వర్షం కురవడంతో మూడో వంతు వార్షిక వర్షపాతాన్ని తలపించింది. ఈ వరదలు మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.

Read More : తిరువనంతపురంలో బ్రిటన్ ఎఫ్-35బి హస్తాంతరం

One thought on “అమెరికా టెక్సాస్‌లో ఘోర వరదల విలయం

Comments are closed.