తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన ఓ లేఖపై ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పందించారు. సీతక్కపై వచ్చిన ప్రకటన తమ పార్టీకి సంబంధించదని స్పష్టం చేశారు. లేఖలోని విషయాలు అసత్యమని, తాము దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. అలాగే దామోదర్ లొంగిపోయారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని, ఈ విషయాన్ని కూడా ప్రజలు నమ్మకూడదని ఆయన తెలిపారు.
ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు కలిగించడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తాలూకు అధికారిక ప్రకటనలకే ప్రజలు విశ్వాసం పెట్టాలని కోరారు.
Read more : ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పాడని భర్తను హత్య చేసిన భార్య

One thought on “మావోయిస్టుల అధికార ప్రకటన”
Comments are closed.