రామ్ చరణ్‌పై వ్యాఖ్యలపై మరోసారి క్షమాపణ

ప్రసిద్ధ నిర్మాత శిరీష్ మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో, శిరీష్ మొదట లేఖ ద్వారా స్పందించగా, తాజాగా వీడియో రూపంలో స్పష్టత ఇచ్చారు. శిరీష్ తెలిపిన వివరాల ప్రకారం… తాను చరణ్‌ను అవమానించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని, వారి మధ్య ఉన్న మైత్రీతో ఓ మాట పొరపాటున బయటికి వచ్చిందన్నారు. “చరణ్ నా అభిమాన హీరోలలో ఒకరు. ఆయనపై గౌరవంతో మాట్లాడుతున్నా. మేము ఎన్నో సినిమాలు కలిసి చేశాం. చిరంజీవి గారితో కూడా మా బంధం బలంగా ఉంది. అలాంటి వారిని అవమానించాలన్న ఆలోచన కూడా చేయను” అని శిరీష్ స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విజయంపై ఓ ఇంటర్వ్యూలో శిరీష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆగ్రహం రేకెత్తించాయి. స్పందన రాకపోవడం అన్న మాట తమ అభిమానితనాన్ని కించపరిచేలా ఉందని వారు భావించారు.

ఈ నేపథ్యంలో శిరీష్ తెలిపారు… “అది నా మొదటి ఇంటర్వ్యూకావడంతో అలా మాట పొరపాటుగా వచ్చినా ఉండొచ్చు. చరణ్‌కు మంచి మనసు ఉంది. సంక్రాంతి రిలీజ్ విషయంలో మా సినిమాకి సహకరించారు. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అవమానిస్తాను?” అని ప్రశ్నించారు.

తాను రామ్ చరణ్‌తో మరో సినిమా చేయాలనుకుంటున్నట్టు వెల్లడించిన శిరీష్… అభిమానులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, మరింత అర్థవంతమైన సంబంధం కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Read More : Pawan Kalyan – రేపు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్