ఎలాన్ మస్క్ సంచలనం: ‘ది అమెరికా పార్టీ’ ప్రారంభం…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త బిల్లుపై ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరుతో ట్రంప్ తీసుకువచ్చిన ఈ బిల్లులో టెక్ సంస్థల నియంత్రణ, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు ఉండటంతో మస్క్ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు ప్రజల హక్కులను హరించేలా ఉందని, సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ‘‘ఈ బిల్లును ఆమోదిస్తే అమెరికా ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. భావప్రకటన స్వేచ్ఛకు ఇది పెద్ద అవమానం’’ అని మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, మస్క్ భారీ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ‘ది అమెరికా పార్టీ’ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రజలకు డెమోక్రటిక్ – రిపబ్లికన్ పార్టీల యూని వ్యవస్థకు బదులుగా ఒక స్వతంత్ర ప్రత్యామ్నాయాన్ని అందించాలన్నదే తన లక్ష్యమని మస్క్ తెలిపారు.

ఈ ప్రకటనతో అమెరికా రాజకీయాల్లో కలకలం రేగింది. 2028లో అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా రాజకీయ దృశ్యాన్ని మస్క్ కొత్తగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : అణు ఒప్పందంపై ట్రంప్ స్పందన

One thought on “ఎలాన్ మస్క్ సంచలనం: ‘ది అమెరికా పార్టీ’ ప్రారంభం…

Comments are closed.