అణు ఒప్పందంపై ట్రంప్ స్పందన

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రభుత్వం 30 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఇవ్వాలని యోచిస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించిన నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అని పేర్కొన్నారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్’లో స్పందిస్తూ… “ఇరాన్‌కు నేను ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదు. ఇలాంటి ఆలోచన ఎప్పుడూ నాకు లేదు. డెమొక్రాట్ సెనేటర్ క్రిస్ కూన్స్‌ను కూడా ఈ విషయం తెలియజేయండి” అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. “జేసీపీవోఏ ఒప్పందంలా బిలియన్ల డాలర్లను ఇరాన్‌కు ఇస్తూ, వారి అణుబాంబు తయారీకి మద్దతు ఇచ్చే రోజులు పోయాయి. ప్రస్తుతం వారి అణు కేంద్రాలను ధ్వంసం చేసిన తర్వాత, మళ్లీ చర్చలకు ఆస్కారం లేదు” అని తెలిపారు.

మరోవైపు, ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం… అమెరికా ప్రభుత్వం పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే కొనసాగించేందుకు ఇరాన్ అంగీకరిస్తే… $30 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తోందని తెలిపింది. అంతేకాదు, గతంలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం పై కూడా ట్రంప్ యంత్రాంగం ఆలోచిస్తోందని పేర్కొంది. ఇది నిస్సారమైన ప్రచారం మాత్రమేనని ట్రంప్ తేల్చి చెప్పారు. కాగా, చర్చల విషయమై ఇరాన్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో తమపై ఎలాంటి దాడులు జరగవని అమెరికా హామీ ఇస్తేనే చర్చలు పునఃప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తుల ద్వారా ట్రంప్ కార్యవర్గం నుంచి తమకు సంకేతాలు వస్తున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మాజిద్ తక్త్ రావంచి తెలిపారు.

read More : 14 భారతీయులను రక్షించిన నౌకాదళం