ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకుల అభిప్రాయాల ప్రకారం ఆయన ఎంపిక జరిగిందని తెలుస్తోంది. అయితే అధికారికంగా పేరు ప్రకటించేవరకు ఎలాంటి ప్రకటన చేయవద్దని పార్టీ నేతలకు కేంద్రం స్పష్టంగా సూచించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన, అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. name నిర్ణయం పూర్తయిందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందన్నారు. ఇటీవల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోని మార్పులు, నాయకత్వంలో సమతౌల్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోము వీర్రాజు వివరించారు. కార్యకర్తల అభీష్టం మేరకే మాధవ్ ఎంపిక జరిగిందన్నారు.
ఇక బీజేపీ ఎంపిక నియమావళి ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ రోజు నామినేషన్లు స్వీకరించి, సాయంత్రం ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. రేపు (మంగళవారం) అధికారికంగా కొత్త అధ్యక్షుని పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించి స్వాగతిస్తారని ఆయన స్పష్టం చేశారు.
Read More : టీడీపీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు…

One thought on “ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ ఖరారు!”
Comments are closed.