పోలీసులపై దాడి, చివరకు మెంటల్ ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌లో ఓ యువతి మానసిక స్థితి అదుపు తప్పిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… ఆమె రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాదం తప్పించేందుకు వెంటనే అప్రమత్తమైన అధికారులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి దిగింది.

ఈ నేపథ్యంలో, ఆమె మానసిక పరిస్థితిని పరిశీలించిన పోలీసులు వెంటనే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం విచారణకు హాజరుకావాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More : జేఈఈలో అర్హత సాధించలేదన్న మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య