పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఓ అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు రేపుతోంది. కోల్‌కతా సౌత్ లా కాలేజీలో చదువుతున్న న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అధికార టీఎంసీ విద్యార్థి విభాగానికి చెందిన నేత ప్రధాన నిందితుడిగా గుర్తించబడాడు. ఈ దారుణానికి కారణం బాధితురాలి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడమేనని పోలీసులు తెలిపారు.
వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు
సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలిపై వైద్య పరీక్షలు నిర్వహించగా, పాశవికంగా జరిగిన అఘాయిత్యం బయటపడింది. ఆమె మెడ, ఛాతీపై పంటి గాట్లు, గోళ్ల దెబ్బల గుర్తులు, అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇది ఏకంగా ఆమె ప్రాణాల మీదకి వచ్చిన అత్యంత క్రూరమైన దాడిగా అధికారులు వివరించారు.
సెక్యూరిటీ గదిలో బంధించి అత్యాచారం
ఈ నెల 25న జరిగిన ఘటనలో నిందితులు బాధితురాలిని కాలేజీలోని సెక్యూరిటీ గదిలోకి లాక్కెళ్లి బంధించారు. ఆమెను హాకీ స్టిక్‌తో కొట్టి గాయపరిచిన తర్వాత, గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. దాడి విషయాన్ని బయటపెడితే తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయిస్తామని ఆమెను బెదిరించినట్లు సమాచారం.
ప్రధాన నిందితుడి రాజకీయ నేపథ్యం
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మోనోజిత్ మిశ్రా (31) టీఎంసీ విద్యార్థి విభాగానికి దక్షిణ కోల్‌కతా జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను న్యాయవాదిగా సేవలందిస్తున్నట్లే కాక, అదే కాలేజీలో అతిథి అధ్యాపకుడిగానూ వ్యవహరిస్తున్నాడు. నిందితుడితో పాటు ఇద్దరు సీనియర్ విద్యార్థులు, ఓ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
రాజకీయంగా దుమారం
టీఎంసీ నేతపై ఆరోపణలతో ఈ ఘటనపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతుండగా, బాధితురాలి కుటుంబానికి న్యాయం కలగాలని విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
Read More ; “నా కుమార్తె బలికాకూడదని పోరాడాం… ఆర్జీకర్ హత్యాచార బాధిత తండ్రి ఆవేదన

One thought on “Medical Report : టీఎంసీ నేత అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలకలం”
Comments are closed.