జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ట్రాన్స్ జెండర్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అడుక్కునే విషయంలో మొదలైన చిన్న వివాదం త్వరలోనే పెద్ద గొడవగా మారింది. జగిత్యాల మరియు సిద్దిపేటలకు చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, ఇరువర్గాలను శాంతింపజేసి స్టేషన్కు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More : లైవ్ స్ట్రీమింగ్ శృంగార రాకెట్: దంపతుల అరెస్ట్
