ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో స్పందించారు. టెహ్రాన్ యురేనియం శుద్ధిని తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. అణ్వాయుధ తయారీ దిశగా మరో అడుగు వేస్తే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే దాడులకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని అల్ సాదిక్ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ అధిపతి అబ్దుల్లా బక్రిని హతమార్చిన ఘటన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హిజ్బొల్లా ముఠాలకు నిధులు అందించడంలో ఈ సంస్థ కీలకంగా ఉన్నట్టు సమాచారం.
ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్టు మరింత చర్చకు దారితీసింది. “ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా యుద్ధం ఆగాలని కోరుకున్నాయి. అణు కేంద్రాలను ధ్వంసం చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపాను,” అంటూ పేర్కొన్నారు.
పుతిన్ ప్రతిపాదనను తిరస్కరించా: ట్రంప్
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణకు పరిష్కారం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు. అయితే, ఆ సాయం అవసరం లేదని తాను స్పష్టంగా చెప్పానని ట్రంప్ వెల్లడించారు. నాటో సదస్సుకు వెళ్లే ముందు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో జర్నలిస్టులతో మాట్లాడారు.
“పుతిన్ నాకు ఫోన్ చేసి ఇరాన్ విషయంలో మీకు సహాయం అవసరమా అని అడిగారు. కానీ నేను బహిష్కరించాను. నాకు అవసరం మీ సహాయం కాదు. రష్యా విషయంలో మీ సహాయం కావాలి” అని అన్నారు ట్రంప్.
నాటో సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం అయ్యే అవకాశముందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత వారం 6,000 మంది సైనికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More : ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది

2 thoughts on “ఇరాన్‌పై ట్రంప్ ఘాటు హెచ్చరికలు”
Comments are closed.