కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన విషయంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. “మాకు దేశం ప్రథమం, కానీ కొందరికి మోదీయే ప్రథమం” అని వ్యాఖ్యానించిన ఖర్గే, శశిథరూర్ పరోక్షంగా విమర్శించారు.
తాజాగా ‘ది హిందూ’ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో థరూర్… ప్రధాని మోదీ శక్తి, చైతన్యం, ప్రపంచ వేదికలపై భారత్ ప్రతిష్ఠ పెంచేందుకు చేస్తున్న కృషిని దేశానికి “ముఖ్యమైన ఆస్తి”గా అభివర్ణించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడిన థరూర్ తీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, “థరూర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ఆయన భాషలో ఆకర్షణ ఉంది. అందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా చేర్చాం. కానీ దేశం ముందు, పార్టీ తర్వాత అన్న మనల్ని మరిచిపోయి… కొందరు మోదీ ముందు, దేశం తర్వాత అనే స్థితిలో ఉన్నారు. మేమేం చేయగలం?” అని వ్యాఖ్యానించారు. ఇక, తాను బీజేపీలో చేరాలన్న ఉద్దేశంతో వ్యాసం రాయలేదని థరూర్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలు, ఐక్యత కోసం ప్రధాని చేస్తున్న కొంతవరకూ కృషిని గుర్తించినట్లు మాత్రమే తన వ్యాసం ఉద్దేశమని స్పష్టంచేశారు. దీనిపై రాజకీయాలు అవసరం లేదని సూచించారు.
Read More : తిరువణ్ణామలైలో ఆస్తి పత్రాల హుండీ కధనంపై వివాదం

One thought on “కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు.”
Comments are closed.