తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం

ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ మరోసారి మత, రాజకీయ అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా ఆయన తమిళనాడులో దేవుడి పేరుతో జరుగుతున్న రాజకీయాలపై తీవ్రంగా స్పందించారు. మతాన్ని రాజకీయ అవసరాల కోసం వినియోగించడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

“తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే మేము ఊరుకోం. మేం పెరియార్ సిద్ధాంతాలను గుండెపూట పెట్టుకుని నడిచే వారం. మతం పేరుతో మమ్మల్ని మోసం చేయాలని చూస్తే అది అసాధ్యం. తమిళ ప్రజలు చాలా తెలివైన వారు. మత రాజకీయాలు చేయాలని చూసే వారికి ఇక్కడ సమర్థన ఉండదు. తమిళనాట మిమ్మల్ని అంగీకరించేది ఎవరూ ఉండరు. మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నవారు” అంటూ సత్యరాజ్ హితవు పలికారు.

ఇటీవల దేశవ్యాప్తంగా మత ఆధారిత వ్యాఖ్యలు, ప్రచారాలు రాజకీయంగా పుంజుకుంటున్న తరుణంలో సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మతాన్ని ఉపయోగించుకుని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు రేకెత్తించడాన్ని వ్యతిరేకిస్తూ, తమ రాష్ట్రపు భావజాలాన్ని గౌరవించాలని ఆయన కోరారు.సత్యరాజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలు రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు కూడా ఈ అంశంపై స్పందించనున్న అవకాశాలు ఉన్నాయి.

Read More : ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు

One thought on “తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం

Comments are closed.