ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు – 639 మంది మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. శుక్రవారం రాత్రి ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేపట్టింది. సమాచారం మేరకు సుమారు 60 యుద్ధ విమానాలు పాల్గొన్న ఈ దాడిలో, ముఖ్యమైన సైనిక, పరిశోధనా కేంద్రాలపై బాంబుల వర్షం కురిసింది. ఈ దాడుల్లో 639 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం అందింది.

ఇజ్రాయెల్ లక్ష్యం స్పష్టమని, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అణచివేయడమే తమ ఉద్దేశమని అక్కడి అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా టెహ్రాన్ సమీపంలోని డిఫెన్సివ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ (SPND) ప్రధాన కార్యాలయంపై తీవ్ర దాడులు జరిపారు. ఈ సంస్థను ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టుకు మూలస్తంభంగా భావిస్తున్నారు.

ఇరాన్ ప్రతిగా, డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు జరిపింది. ఇటు యూరోపియన్ యూనియన్, అమెరికా లాంటి దేశాలు ఈ ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించేందుకు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై చర్య తీసుకోవాలన్న అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకారం, ఈ దాడుల్లో ప్రధానంగా క్షిపణి తయారీ కేంద్రాలు, రాకెట్ ఇంజిన్ల ముడిపదార్థాల పరిశ్రమలు, సైనిక పరిశోధనా భవనాలపై దృష్టి సారించారు. SPND కేంద్రం పూర్తిగా ధ్వంసమైనట్టు ఐడీఎఫ్ వెల్లడించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ భయం గబ్బలిపడుతోంది. మళ్లీ యుద్ధం చెలరేగే అవకాశంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read More : ఇజ్రాయిల్ దాడులపై తీవ్ర అసంతృప్తి

One thought on “ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు – 639 మంది మృతి

Comments are closed.