భారత్–ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తెరలేసింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో బరిలో దిగిన భారత జట్టు ఈ సిరీస్‌ను గెలిచి తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే హోం కండిషన్స్ లో బజ్‌బాల్ ధోరణితో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ జట్టును తక్కువగా అంచనా వేయలేమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సుదీర్ఘ సిరీస్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి మ్యాచ్ నుంచే రెండు జట్లు తమ బెస్ట్ ప్రదర్శన ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాయి.
భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
ఈ సిరీస్ భారత యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చూపించే అవకాశంగా మారనుండగా, ఇంగ్లాండ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది.
Read More : క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణం..!

One thought on “లీడ్స్ టెస్టుతో భారత్-ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభం”
Comments are closed.